యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు. మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. శ్రావణమాసంతో పాటు ఆదివారం సెలవురోజు కావడంతో ఇలవే ల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరో మారు పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తు లే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు.
స్వామి వారి ప్రాంగణం పూర్తిగా భక్తులతో నిడిపోయింది. వాహనాల రాకతో కొండకింద ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. భక్తుల రద్ధీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సైతం భక్తుల రద్ధీ భారీగా కొనసాగింది. భక్తులు అధిక సంఖ్యలో పూర్వగిరిశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.