హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం లో పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ తన గు ప్పిట్లో పెట్టుకొని నియంతపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ యావత్తు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులను అరె స్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని, వారేమైనా టెర్రరిస్ట్‌లా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తల కదలికలపైనా నిఘా ఎందుకని నిలదీశారు. ప్రధాన మీడియాను గు ప్పిట్లో పెట్టుకొని సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయాలన్న భ్రమలో సీఎం ఉన్నారని ఆరోపించారు.
తెలంగాణ గడ్డ మీద అణిచివేత ఏ స్థాయి లో ఉంటే అంతకు రెట్టించిన వేగంతో నిరసన ఉబికివస్తుందనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి దారుణమైన నిర్బంధాలను చూడలేదని, బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే సీఎం ఎం దుకు వణుకుతున్నారని ప్రశ్నించారు.