హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై మళ్లీ సమైక్యవాదులు కుట్రలకు తెరలేపారని బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య దోస్తీ బయటపడటంతో బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
11 నెలల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తే, నాలుగు నెలల క్రితం కేటీఆర్.. రమేశ్‌ను ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్‌రెడ్డి, సీఎం రమేశ్ కంచ గచ్చిబౌలి భూములను దోచుకొనేందుకు ప్రణాళికలు వేశారని ఆరోపించారు.