హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మేక్ ఇన్ ఇండియా అం టూ డబ్బా కొట్టుకుంటూ, జబ్బలు చరుచుకునే కేంద్ర పాలకులు చైనా నుంచి యూరియా దిగుమతిపై ఏం సమాధానం చెప్తారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించా రు.
చైనాకు చెందిన 50 మొబైల్ యాప్స్‌ను బహిషరించి దేశభక్తిగా చాటుకునే ప్రయత్నం చేసిన ప్రధాని మోదీ.. చైనా నుంచి యూరియా దిగుమతి అంశంపై ప్రజలకు ఏంచెప్తారని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా చైనా నుంచి యూరియా దిగుమతిలో ఆటంకం ఏర్పడిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్ప డం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ బీటీమ్‌గా వ్యవహరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనాన్ని కప్పిపుచ్చడాన్ని మానుకోవాలని సూచించారు.