హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ రేస్‌ను రాష్ట్రంలో మరోసారి నిర్వహించకుండా నష్టం చేకూర్చిన సీఎం రేవంత్‌రెడ్డే అసలు దోషి అని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ రేస్‌తో రూ.50 కోట్లు రాష్ర్టానికి రాకుండా నష్టం చేశారని, సుమారు రూ.900 కోట్ల పెట్టుబడులు రాకుండా ఆయనే అడ్డుకున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో రాష్ర్టానికి నష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సరారు దుర్మార్గపూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. 2023లో జరిగిన ఈవెంట్‌కు ప్రభుత్వం చేసిన ఒక రూపాయి ఖర్చు కూడా వృథా కాలేదని, తద్వారా రూ.700 కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయని తెలిపారు. 2024లో ఈ రేస్ రాష్ట్రంలోనే జరగాలని, మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ భావించారని తెలిపారు.
రేవంత్ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఫార్ములా ఈరేస్‌ను తమిళనాడు ప్రభుత్వం ఎగరేసుకుపోయిందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, దుర్బుద్ధి వల్ల రాష్ట్రానికి రూ.800 కోట్లకుపైగా నష్టం జరిగిందని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్‌లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదనే విషయం సీఎం రేవంత్‌రెడ్డి సహా ప్రతీ ఒక్కరికీ తెలుసని పేర్కొన్నారు. అందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహించకపోవడంతో రాష్ర్టానికి జరిగిన నష్టానికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యుడని విమర్శించారు.