హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టు వ్యాఖ్యలతోనైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకొని తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హితవుపలికారు. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థలనే కనీస ఇంగితం మరిచి సీఎం వ్యవహరించటం బాధాకరమని పేర్కొన్నారు.సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించేలా వ్యాఖ్యానించటం సరికాదనే అవగాహన రేవంత్‌రెడ్డికి లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వేసిన అక్షింతలతో అయినా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. ఈడీ, సీబీఐ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కవిత నేరం చేసినట్టు రుజువులు చూపలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రూ.50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొన్నారు. నాడు రేవంత్‌రెడ్డికి బెయిల్ రావడం వెనుక బీజేపీ సహకారం ఉందని అనుకోవాలా? అని ప్రశ్నించారు.