మణికొండ, అక్టోబర్ 12 : విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడానికి వై యాక్సిస్ సరైన వేదిక అని తెలంగాణ టుడే పత్రిక సంపాదకుడు కే శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలోని మహత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల(ఎంజీఐటీ)లో తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ దినపత్రికల ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ‘ఆవేర్నెస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలామంది విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలని ఆశ ఉన్నా వివరాలు తెలియక ఇబ్బందులు పడుతుంటారని, అలాంటివారికి వైయాక్సిస్ ఆశాజ్యోతిలా ఉంటూ మార్గదర్శనం చేస్తున్నదని చెప్పారు. వైయాక్సిస్ కన్సల్టెన్సీ ద్వారా శిక్షణ పొందే బీటెక్ విద్యార్థులకు ఇక్కడ అన్ని రకాల సహకారం లభిస్తున్నదని అన్నారు. విదేశాలలో చదువుకోవాలనుకొనేవారి కోసమే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు.
విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల యాజమాన్యాలు వైయాక్సిస్ ద్వారా ఎంజీఐటీ విద్యార్థులకు అవగాహన కల్పించటం సంతోషంగా ఉన్నదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విదేశాలలో చదువుకోవాలనుకొనే విద్యార్థులు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం నుంచే ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. వై యాక్సిస్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ పేపర్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన వారిలో చాలామంది విదేశాలలో చదువుకోవాలని ఆశిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోని పలు ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు గల అవకాశాలను చెప్తూ దిశా నిర్దేశం చేశారు. ఏవిధమైన పరీక్షలుంటాయి, వీసా పొందడమెలా, భాషా సమస్యలను ఎలా అధిగమించాలనే అంశాలను వివరించారు. ఈ విషయంలో వైయాక్సిస్ ముందుగానే మాక్ పరీక్షలు నిర్వహించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తున్నదని చెప్పారు. ఇక తమ సంస్థ గురించి వివరిస్తూ.. 1999లో స్థాపించిన వై యాక్సిస్.. దేశంలోనే ప్రథమ ఓవర్సీస్ కెరీర్ కన్సల్టెంట్‌గా ప్రపంచంలోనే అతిపెద్ద బీ2సీ సంస్థగా ఉన్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా 60 కార్యాలయాలతోపాటు దుబాయ్, షార్జా, మెల్బోర్న్, సిడ్నీలో సేవలందిస్తున్నామని, 1500 మంది ఉద్యోగులు 10 లక్షల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నారని తెలిపారు. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా, బ్రిటన్, యుఏఈ తదితర దేశాలలోనూ సందర్శకుల వీసా, విద్యార్థుల వీసా, అడ్మిషన్, ఉద్యోగ వీసా, వ్యాపార ఆధారిత ప్రవేశ వీసా, పీఆర్ వీసా, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ వంటివాటికి వై యాక్సిస్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, సీజీసీ చైర్మన్ డాక్టర్ సీఎస్ శ్రీనివాస్, తెలంగాణటుడే, నమస్తే తెలంగాణ ప్రతినిధులు గణేశ్, మహేశ్ సుమారు 4 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థి లోకానికి ఎంతో ఉపయోగకరం
సమకాలీన ప్రపంచంలో ఉద్యోగ, వ్యాపార రీత్యా ముందుకు సాగేందుకు, ఇతర అవకాశాలకు వై యాక్సిస్ లాంటి దిగ్గజ కన్సల్టెంట్ సంస్థ ఓ చక్కటి వేదిక. విదేశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇదో సువర్ణ అవకాశమే, తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ లీడింగ్ పత్రికల యజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వై యాక్సిస్ దిగ్గజ కన్సల్టెంట్‌తో సంయుక్త నిర్వహణ చేయడం హర్షణీయం. ఇదీ విద్యార్థి లోకానికి, ఉద్యోగ, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కల్గిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే ఆసక్తి కల్గిన విద్యార్థులు సకాలంలో ప్లాన్ చేసుకొని వై యాక్సిస్ కన్సల్టెంట్ సంస్థలను ఆశ్రయిస్తే మంచి భవిష్యత్తు దొరుకుతుంది. -డాక్టర్ చంద్రమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్, ఎంజీఐటీ
విద్యార్థులకే అధిక ప్రాధాన్యం
కొవిడ్ తర్వాత విదేశాలలో చదువుకొనేందుకు విద్యార్థులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వై యాక్సిస్ కన్సల్టెంట్ ద్వారా ప్రతి నెల వేల మంది విద్యా, ఉద్యోగాల కోసం ఆయా దేశాలకు వెళ్తున్నారు. అందుకు మా సంస్థ ఆరు నుంచి ఏడు మాసాల పాటు పూర్తిస్థాయి శిక్షణ అందించి వీసాలను అందజేసి విదేశాలకు పంపుతున్నది. డిగ్రీ, ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలోనే విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటే మంచి అవకాశాలు కల్పించే వీలు ఉంటుంది. హైదరాబాద్‌లోని మా కార్యాలయాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మాదాపూర్, పంజాగుట్ట లాంటి ప్రాంతాలలో ఆసక్తి గలవారికి అవగాహన కల్పిస్తాం.
– ఫైజల్ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్, వై యాక్సిస్