హైదరాబాద్, అక్టోబర్23 (నమస్తే తెలంగాణ): మూసీపై సమస్యలేవైనా ఉంటే తమకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఎంపీలకు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. సియోల్ పర్యటన తర్వాత పునరావాసం విషయంలో నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని వివరించారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ ధర్నాలు, నిరసనల పేరిట మొసలి కన్నీరు కార్చడం సరికాదని, తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడాలనుకుంటే మూసీ ప్రాజెక్టుకు బీజేపీ నేతలు సహకరించాలని సూచించారు.
స్మార్ట్ సిటీల సందర్శన
దక్షిణ కోరియా పర్యటనలో భాగంగా ఇంచియాన్ నగరంలో భాగమైన మూడు అంతర్జాతీయ స్మార్ట్‌సిటీలు చియో ంగ్న, సాంగడో, యెంగ్జంగ్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తదితరులు సందర్శించారు.