హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై సింగరేణి కార్మికులు భగ్గుమన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు.
తెలంగాణలోని సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు నియోజకవర్గం మందమర్రి డివిజన్ పరిధిలోని KK5,కాసిపేట 1,2, KK 1A, KK 1, KKOCP, వర్క్ షాప్ గనులపై కేంద్రం బీదిష్టిబొమ్మను TBGKS నాయకు, కార్మికులు దగ్ధం చేశారు.
బెల్లంపల్లి డివిజన్ లోని అబ్బాపూర్ ఓపెన్ కాస్ట్, గోలేటి CHP, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్, వర్క్ షాప్‌లలో..శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని RK 6 & 7, SRP 1, RK NEW TECH, RK 1A, RK 1 OC, SRP 3,SRPOC,WORK SHOP ల వద్ద ప్రధాని మోదీ శవయాత్ర నిర్వహించి, దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తామంటే సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.