హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వెంగళ్రావు పార్కులో నిర్వహించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత తెలంగాణను కాంక్షిస్తూ ఈ ప్రత్యేకమైన రోజు మొక్కలు నాటడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మహిళలకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రీన్ఇండియా చాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.