భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టబోరు, కొత్తూరులో తాగునీరందక స్థానికులు సతమతమవుతున్నారు. శుక్రవారం గుట్టబోరులో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మూడు నెలలుగా తాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ అమలు చేసిన మిషన్ భగీరథ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.