హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 22 : ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ రాలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని మహిళలు నిలదీశారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 7వ డివిజన్లోని విజయ టాకీస్ వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే, మేయర్ రాగా ఎమ్మెల్యేను మహిళలు ప్రశ్నించారు.ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు ఇస్తున్నారని, ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా బయట పడేస్తున్నారు తప్ప ఇస్తలేరని వాపోయారు.
‘నీకు రాకపోతే వచ్చి దరఖాస్తు చేసుకో.. వేరే వాళ్ల గురించి నీకెందుకమ్మా.. ఇప్పుడు దరఖాస్తు ఇచ్చినవ్ కదా.. చూస్తా’ అని ఎమ్మెల్యే మహిళపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ రావడం లేదని మహిళ వేడుకుంది.