హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్ భవన్‌కు వెళ్లేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు మెహిదీపట్నం బస్టాండ్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా అక్కడున్న ప్రయాణికులు హరీశ్‌రావును చూసి దగ్గరకు వచ్చారు. మహిళా ప్రయాణికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు.. దానివల్ల మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు అని ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు.. మాకు ఇబ్బంది అవుతుంది అని పేర్కొంది. బస్సులు కూడా బస్టాండ్‌లో ఆపడంలేదు అని మహిళా ప్రయాణికులు తెలిపారు.
మరో వృద్ధురాలు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇస్తామన్న రూ. 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదు. పెన్షన్లకు దిక్కే లేదు. కేసీఆర్ రూ. 2 వేలు ఇచ్చేవారని, ఆయన ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నామని వృద్ధురాలు చెప్పారు. రేవంత్ రెడ్డి ఏం ఇస్తడో అని ఆ వృద్ధురాలు పెదవి విరిచింది.
ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు.. దానివల్ల మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు
పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు.. మాకు ఇబ్బంది అవుతుంది
బస్సులు కూడా బస్సు స్టాండులో ఆపడంలేదు
మెహదీపట్నం ఆర్టీసీ బస్సు డిపో వద్ద ప్రయాణికులతో ముచ్చటించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హరీష్ రావుతో తమ కష్టాలు… pic.twitter.com/w2AjlWQEzo
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025