జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కోరండ్లపల్లె సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న మహిళ అక్కడిక్కడే మృతిచెందగా, చిన్నారి గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో చిన్నారిని దవాఖానకు తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉందని తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచే దర్యాప్తు చేస్తున్నారు. మృతరాలి వివరాలు తెలియాల్సి ఉన్నది.