Sunitha Rao | హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని సునీత రావు ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ తన చెల్లెళ్లు, మరదల్లకు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చుకుంటున్నాడని ఆమె ఆరోపించారు.
గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదురుగా.. మహిళా నేతలతో కలిసి సునీత రావు ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు కమిటీల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని సునీతా రావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏం అయ్యింది? గతంలో మహిళ కాంగ్రెస్‌కి పెద్దగా ప్రియారిటీ లేకుండే.. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నా కర్తవ్యం నిర్వహించాను.. 241 కార్యక్రమాలు నిర్వహించాం. గట్టిగా పని చేస్తుంది అని నమ్మి పార్టీ టిక్కెట్ ఇచ్చింది.. గోషామహల్ టిక్కెట్ వద్దన్న కూడా ఇచ్చారు.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగింది. టిక్కెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారు. ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారని సునీతా రావు గతంలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మహేష్ కుమార్ గౌడ్ చెల్లెళ్ళు, మరదల్లకు పదవులు ఇచ్చుకుంటున్నాడు
గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ధర్నా
కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుంది
నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని సునీతా రావు ఆవేదన
పీసీసీ అధ్యక్షుడు మహేష్… pic.twitter.com/ykYwi2NPYu
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2025