హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేయాలని, తద్వారా రాష్ట్రంలోని 3 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) తెలిపింది.
ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్కు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాపురం స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ వినతిపత్రం సమర్పించారు. పాత పెన్షన్ విధానం అమలు, లాభాలను వివరించే నివేదికను కూడా అందజేసింది. పలు రాష్ర్టాల్లో పాత పెన్షన్ విధానం అమలవుతున్న తీరును ఈ సందర్భంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు.