హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దుకావంటూ సభలో ఒక ముఖ్యమంత్రి ప్రకటించడం ఏమిటని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టును అవహేళన చేస్తూ సీఎం మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని తేల్చిచెప్పారు. శాంతిభద్రతలపై తాను ప్రశ్నలు అడిగితే నేటికీ సమాధానం ఇవ్వలేదని, ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇంటిపై దాడిచేసిన ఎమ్మెల్యే గాంధీతోపాటు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోనేలేదని మండిపడ్డారు.