హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తేతెలంగాణ) : నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 22వ తేదీ వరకు పొడి వాతావరణమే ఉంటుందన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 18 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.