హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పె ట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి, రాష్ట్ర పన్నులు తగ్గించాలి’అని నాడు పీసీ సీ అధ్యక్షుడి హోదాలో వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి, నేడు అధికారంలో ఉండి ఎం దుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీశారు.
ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచు డు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌కు సోమవారం ఘాటుగా లేఖ రాశారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అన్ని వర్గాల ప్రజ లు ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పెరిగిన ధరలతో ప్రతినెలా రూ.162 కోట్లు, ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున అదనపు వ్యాట్ ఆదాయం వస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విడిచిపెట్టి ప్రచారాలకే పెద్దపీట వేస్తున్నదన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వైద్యవ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని హరీశ్‌రావు విమర్శించారు. పేదల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? ఎందుకింత నిర్ల క్ష్యం? అని ప్రశ్నించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో చెప్పేందుకు ఇటీవల తాండూరు, భద్రాచలంలో జరిగిన అమానవీయ ఘటనలే సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. తాండూరు రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి పురిటినొప్పులతో ఓ గర్భిణి ప్రాణాలతో పోరాడుతుంటే 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చివరికి రైల్వే ప్లాట్‌ఫారంపైనే ఆ తల్లి ఆడబిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భద్రాచలం ఏరియా దవాఖానలో మరణించిన బంధువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని వేడుకున్నా దవాఖాన సిబ్బంది కనికరించలేదని మండిపడ్డారు. ప్రైవేట్ వాహ నం మాట్లాడుకొనే స్థోమత లేక ఆ కుటు ంబం శవాన్ని భుజాలపై మోస్తూ వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ప్రతి ఒక్కరి మనసును కలచివేసిందని పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇం తటి దారుణం జరుగడం కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.