KTR | ఉద్యోగులకు 1న జీతం పచ్చి అబద్ధం.. వసీం ఆత్మహత్యకు కారణమెవరు?: కేటీఆర్
మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
హైదరాబాద్: మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. వసీం బలవన్మరణానికి కారణమెవరని ప్రశ్నించారు.
ప్రతి నెల ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలిస్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నది. అది పచ్చి అబద్ధమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యానికి వసీం ఆత్మహత్యే ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అతని ఆత్మహత్యకు కారణమెవరని నిలదీశారు.
సూసైడ్ నోట్ రాసి..
వసీం తన భార్య రజనికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ‘డియర్ రజని.. ముందు నువ్వు నన్ను క్షమించు. నిన్ను చాలా బాధపెట్టాను. పిల్లలు జాగ్రత్త. మనకు ఎవ్వరు లేరు. కానీ, మన పిల్లలు అలా కాకూడదు. నేను చాలాఆ ఊహలుకన్నాను. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మ అని ఉంటే నా పిల్లలో ఎవరికైనా కొడుకుగా పుడతా. ఇంకొక్కటి రజనీ నీకు వీలైతే వీళ్లకు డబ్బులివ్వు. ఎక్కువేం చేయలే..’. అంటూ తాను ఎవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నాని ఆ లేఖలో వెల్లడించారు.
Congress Govt makes tall claims that they have been prompt in delivering salaries to all govt employees on the 1st of every month
An example of their absolute lies & utter failure is 👇
Wasim, an employee of Suryapet Govt Hospital has committed suicide as he has been… pic.twitter.com/gXxLX9iHBQ
— KTR (@KTRBRS) August 18, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

