ప్రాణం మీదికి తెచ్చిన ప్రేమ
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌లోని కేసీఆర్‌నగర్ 2బీహెచ్‌కే సముదాయంలో చోటు చేసుకుంది.
- ఎనిమిదో అంతస్తు నుంచి జారిపడి యువతి మృతి
- కొల్లూర్ కేసీఆర్‌నగర్ కాలనీలో విషాదం
రామచంద్రాపురం, డిసెంబర్ 19: ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌లోని కేసీఆర్‌నగర్ 2బీహెచ్‌కే సముదాయంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చార్మినార్కి చెందిన హాలమ్ద్దార్ ఉస్సేన్ కూతురు ఫాతిమా, చార్మినార్‌కే చెందిన మీర్ఉస్సేన్ అలీఖాన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కొంతకాలం కోఠిలోని ఓ కాల్సెంటర్లో ఉద్యోగం చేశారు. ఫాతిమా కోటి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతుంది. ఫాతిమా, మీర్ఉస్సేన్ అలీఖాన్ ఇద్దరు కాల్సెంటర్లో ఉద్యోగం చేసే సమయంలో పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఫాతిమా తండ్రికి కొల్లూర్ 2బీహెచ్‌కే సముదాయంలోని 40వ బ్లాక్‌లో 813 ఫ్లాట్ వచ్చింది. ఆ కుటుంబం ఇంకా ఇక్కడికి షిఫ్ట్ కాకపోవడంతో ఖాళీగా ఉంది. అప్పుడప్పుడు ఆయన వచ్చి తమ ఫ్లాట్‌ని చూసుకొని వెళ్లేవాడు. గురువారం మధ్యాహ్నం ఫాతిమా ప్రియుడితో కలిసి డబుల్ బెడ్రూం ఇంటికి వచ్చింది. అదే సమయంలో తన తండ్రి ఉస్సేన్ ఫ్లాట్ వద్దకు రావడంతో బయట నుంచి తాళం తీసి ఉండడాన్ని గ్రహించి డోర్‌ని కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా తన తండ్రి గొంతు విని భయంతో టెన్షన్‌కు గురైంది. ఆ సమయంలో ఏమి చేయాలో తోచక ప్రియుడు మీన్ఉస్సేన్ అలీఖాన్ సహకారంతో బాల్కానీ నుంచి కింది బాల్కానీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుతప్పి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడు సయ్యద్ అలీ అబ్బాస్ ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

