KTR | తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు?.. ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్‌లోని 9 బ్యాంకు అకౌంట్లకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్‌లోని 9 బ్యాంకు అకౌంట్లకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయి. అందులో వీ6 బిజినెస్ ఓనర్‌కు రూ.4.5 కోట్లు బదిలీ అయ్యాయయని, అతడు ఎవరని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులు ఎవరన్నారు. వారికి కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏంటన్నారు. వాల్మీకి స్కామ్‌కు సంబంధించి రాష్ట్రంలో సిట్, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయని, దర్యాప్తు సంస్థల సోదాల వార్తలు బయటకు రాకుండా అణచివేశారని చెప్పారు.
రూ.90 కోట్లు అవినీతి జరిగిందని కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని చెప్పారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీశ్ జార్కిహోళి అన్నారు. అందులో అర్ధమేమిటి. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ మౌనంగా ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
The outrageous Valmiki Scam in Karnataka and its intriguing link to Telangana politicians & business men
✳️ Who are the 9 bank account holders in Hyderabad to whom the ST Corporation money of Rs. 45 Cr was transferred?
✳️ Who is the owner of “V6 Business” to which Rs. 4.5 Cr… pic.twitter.com/qQxlZdaTSu
— KTR (@KTRBRS) August 24, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

