Ravula Sridhar Reddy | కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల విఫలపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి.
ఈ క్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420కిపైగా హామీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. 1000 రోజులు కాంగ్రెస్ సర్కార్ పాలనలో వారు ఇచ్చిన హామీలపై ప్రజలు ఇప్పటికి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా ఫెయిలయ్యిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసింది. అలవి హామీలపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారని ఆరోపించారు. మా అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మేమంతా ప్రతీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై అవగాహన కల్పిస్తామన్నారు.
#WATCH | Hyderabad, Telangana | BRS spokesperson Ravula Sridhar Reddy says, “The Congress party came to power in Telangana by giving six guarantees, 13 declarations, and more than 420 promises. After 1,000 days of their government, people are still waiting for answers… The… pic.twitter.com/gudSQdARKZ
— ANI (@ANI) September 3, 2026
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు