ధరూర్, సెప్టెంబర్ 16: ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై సదరు లబ్ధిదారుడి బిల్లు కాజేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కోసం సదరు రైతు దరఖాస్తు చేసుకోగా ఈ విషయం జోగుళాంబ గ ద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ధరూర్ మండలం అల్వాల్పాడుకు చెందిన కేపీ తిప్పన్న ఇందిరమ్మ ఇంటి కోసం దరఖా స్తు చేసుకోగా, అతడి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు రికార్డులో ఉన్నదని, కొత్తగా ఇల్లు ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. గతంలో తన పేరుపై ఎవరో ఇంటి బిల్లు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.