KTR | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి.. తనలాగే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాలని భావిస్తున్నట్లు ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) ద్వారా షేర్ చేస్తూ మండిపడ్డారు.
ఓ ప్రభుత్వ స్కీమ్ ద్వారా తమ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు జైలుకు పంపిస్తానని ప్రతిష్టాత్మక సంస్థ అయిన L&T కంపెనీకి చెందిన CXOను బహిరంగంగా, నిర్మొహమాటంగా బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన ప్రకటనలతో పారిశ్రామిక వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదేనా మీరు అనుసరిస్తున్న వ్యూహమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని నిలదీశారు.
As Revanth experienced jail life after being caught red-handed with a bag of cash, he seems to want everyone else to experience the same
Which Chief Minister, in his right mind, would openly and callously threaten the CXO of a reputed organisation like L&T with jail time simply… pic.twitter.com/haGQ6misnv
— KTR (@KTRBRS) December 15, 2024