హైదరాబాద్: బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేశామన్నారు. గాంధీ దవాఖానకు కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
A 3-member fact-finding team led by Former Health minister Dr. Rajaiah Garu, former MLA Dr Methuku Anand and MLA Dr Sanjay was set up by BRS to investigate the deteriorating medical services in Telangana. The Telangana Congress Govt’s brazen attempt to block the fact-finding team… pic.twitter.com/K7Z3Uz8zxZ
— KTR (@KTRBRS) September 23, 2024
గాంధీ సహా రాష్ట్రంలోని దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా నిర్బంధాలకు పాల్పడుతున్నది. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ దవాఖానను సందర్శించాల్సి ఉన్నది. దీంతో రాజయ్య సహా కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వారి ఇండ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు గాంధీ దవాఖాన వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. హాస్పిటల్లోకి వెళ్తున్న ప్రతిఒక్కరిని తనిఖీచేస్తున్నారు.