గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 14:41:03

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి : కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాల అమలు ఆగలేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి తో కలిసి కల్వకుర్తి నుంచి కడ్తల్ మీదుగా మాదారం వరకు రూ. 20 కోట్ల 40 లక్షల రూపాయల తో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కడ్తల్ మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం పనులకు, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు మండలం ముచ్చర్ల, గూడూరు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు శంకుస్థాపన చేశారు.

అలాగే మండలం లోని రేషన్ డీలర్ల కు కమీషన్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. కల్వకుర్తి మాదారం రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి ప్రజల అసౌకర్యన్నీ దూరం చేస్తామన్నారు. ఫార్మా సిటీ 20 వేల ఎకరాల్లో ఏర్పాటు అవుతుంది. దీంతో ఇక్కడ మరో హైటెక్ సిటీలాగా మారి అభివృద్ధి జరుగనుందని మంత్రి పేర్కొన్నారు.

 ఔటర్ రింగ్ రోడ్డు లాగా మరో రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే ఇంటింటికి  నీరు సరఫరా జరుగుతుంది. ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్ పనుల పూర్తి కోసం త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 

 logo