సూర్యాపేట : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ( Polytechnic Students) శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయంపై పోరాడాలని విద్యార్థులు సూచించారు.
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా తీసుకున్న శక్తి స్కీం నిర్ణయాలను వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తమ పక్షాన పోరాడి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రిని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన జగదీష్‌రెడ్డి విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.