Enugula Rakesh Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ వద్ద బెటాలియన్ల కొద్దీ పోలీసులను దింపారని తెలిపారు. అభద్రతాభావంతో పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కేటీఆర్ పేరు చెప్పగానే సీఎం రేవంత్ రెడ్డి లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రెండేళ్లలో కమిషన్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏముందని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతుంటే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు రోడ్డు పాలయ్యారని అన్నారు. వాటాల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని తెలిపారు. వీటన్నింటి నుంచి ప్రజలను మభ్య పెట్టేందుకే సిట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో పథకాల పండుగ జరిగిందని.. రేవంత్ రెడ్డి హయాంలో అవినీతి పండుగ జరుగుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకులను సినిమా చూపిస్తామని హెచ్చరించారు.