సికింద్రాబాద్ : రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ చరిత్రను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ దీస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ( Talasani Srinivas Yadav ) హెచ్చరించారు. గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ ఆనవాళ్లు తుడిచేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.
‘బచావో సికింద్రాబాద్ ’ పేరిట ఈ నెల 17 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిర్వహించే శాంతి ర్యాలీ పోస్టర్‌ను తలసాని ఆవిష్కరించారు. శాంతి ర్యాలీలో ముఖ్య అతిధిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీలకు అతీతంగా శాంతి ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తనపై పెట్టిన కేసును న్యాయస్థానంలో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. చట్టం అనేది అందరికీ ఒకేలా వర్తించాలని, ప్రభుత్వం లోని పెద్దలు ఏ స్థాయిలో ఉన్న అసభ్య పదజాలం వాడితే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.