రంగారెడ్డి, జూన్ 2 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్సిటీలోనే ఫార్మాసిటీ కూడా ఉంటుందని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జరిగిన రాష్ర్టావతరణ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీతోపాటు ఫార్మాసిటీ కూడా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసిందని పలు సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితోపాటు పలువురు నేతలు ప్రకటించారు.
కానీ, మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం ఫ్యూచర్సిటీలోనే ఫార్మాసిటీ ఉంటుందని ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు 300 అడుగుల వెడల్పుతో సుమారు 4,000 కోట్ల అంచనాతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని, ఈ రోడ్డు ఫ్యూచర్‌సిటీ అభివృద్ధికి తొలిమెట్టు అని తెలిపారు.