హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజా సమస్యల పరిషారమే లక్ష్యంగా అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. గురువారం నగర బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయా న్ని తాము మరింత బాధ్యతగా తీసుకుని భవిష్యత్లో ప్రజాసమస్యలపై ప్ర భుత్వాన్ని ఎండగడుతామని అన్నారు.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా రాయికల్లో దళిత మహిళా ఆశావరర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఆశావర్కర్పై అత్యాచారం జరిగి వారం రోజులవుతున్నా.. నిందితున్ని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.