శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 14:57:33

సీతారామ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేస్తాం

సీతారామ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేస్తాం

భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల వర ప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేసి 6.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతకొత్తగూడెంలో రూ.2.20 కోట్లతో ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.70 కోట్లతో కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. 

గత ప్రభుత్వాలు 2,400 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని, అవసరం లేకుండా కాలువలు తవ్వారని విమర్శించారు. ఆ కాలువలను సీతారామ డిస్ట్రిబ్యూటరీ కాలువలుగా ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తదితరులు ఉన్నారు.


logo