ACB Telangana | రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్విట్టర్లోకి అడుగుపెట్టింది. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం నాడు ట్విట్టర్ (ఎక్స్ ) ఖాతా తెరిచింది. ACB Telangana పేరుతో తెరిచిన ఈ ట్విట్టర్(ఎక్స్) అకౌంట్‌కు.. సీవీ ఆనంద్ ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టింది. ఈ సందర్భంగా తొలి పోస్టు చేసిన ఏసీబీ.. అవినీతిపై ట్విట్టర్ ద్వారా మాత్రం ఫిర్యాదు చేయవద్దని సూచించింది.
అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 లేదా మెయిల్ dg_acb@telangana.gov.in ద్వారా మాత్రమే ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోధక శాఖ ట్విట్టర్ వేదికగా సూచించింది. ఈ మూడు మార్గాల ద్వారా ఫిర్యాదు చేస్తే అవినీతి అధికారులను అరెస్టు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. అలా కాకుండా ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తే అవినీతి అధికారులు జాగ్రత్త పడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.
This is the first post on the X handle of Telangana ACB department.
People of Telangana are kindly requested not to post complaints about corruption on this handle. Even if you do, you’ll be guided to various methods through which you can actually report, including the… pic.twitter.com/rmLu5f6mLf
— ACB Telangana (@TelanganaACB) April 20, 2024