Mallu BhattiVikramarka | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరైన నాణ్యమైన కరెంట్ లేక రైతులు బిక్కుబిక్కుమంటూ కాలమెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడొస్తదా.. వచ్చినా ఎప్పుడు పోతదో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
24 గంటలు కాదు కనీసం 5-6 గంటలు కూడా సరైన కరెంట్ ఉండకపోవడంతో రైతన్నలు చేసేదేమి లేక కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ వరి చేన్లను తడుపుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ కష్టాలు మళ్లీ తెచ్చింది అంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో రైతులు జనరేటర్ల సహాయంతో నీళ్లు పారిస్తున్నారు. ఈ క్రమంలో ఇవేవీ పట్టనట్టుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కరెంట్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ప్రెస్మీట్లో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. 15 వేల మెగావాట్ల మధ్యలో ఉండాల్సిన పీక్ డిమాండ్ దాదాపు ఇవాళ 20 వేల పీక్ డిమాండ్‌కు వెళ్తే కూడా ఇవాళ మన విద్యుత్ కంపెనీలైన ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఎటువంటి కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేయగలిగాం. చేస్తున్నాం కూడా అన్నారు.
ఎటువంటి అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ అందిస్తున్నాము
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క https://t.co/jlMHiXqv34
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2026
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!