సీపీఎస్ రద్దు చేయాల్సిందే!
పాత పింఛన్ సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ఇచ్చిన హామీ అమలులో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, టీచర్లు సామూహిక సెలవులు పెట్టారు. విధులకు గైర్హాజరై నిరసన గళం వినిపించారు. మరోవైపు జిల్లాల్లో శాంతియుత ధర్మదీక్షలకు దిగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. 1.7 లక్షల మంది మంగళవారం సెలవు పెట్టినట్టు సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాపురం స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ తెలిపారు. సామూహిక సెలవుల ప్రభావం పలు కార్యాలయాలు, బడుల్లో స్పష్టంగా కనిపించింది.
- పంతం పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు
- సామూహిక సెలవులో 1.72 లక్షల మంది
- జిల్లాల్లో ధర్మదీక్ష చేపట్టి నిరసన
- సర్కార్ ఆఫీసులన్నీ ఖాళీ.. బడుల్లో సాగని బోధన
- రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన ఉద్యమం
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): పాత పింఛన్ సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ఇచ్చిన హామీ అమలులో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, టీచర్లు సామూహిక సెలవులు పెట్టారు. విధులకు గైర్హాజరై నిరసన గళం వినిపించారు. మరోవైపు జిల్లాల్లో శాంతియుత ధర్మదీక్షలకు దిగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. 1.7 లక్షల మంది మంగళవారం సెలవు పెట్టినట్టు సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాపురం స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ తెలిపారు. సామూహిక సెలవుల ప్రభావం పలు కార్యాలయాలు, బడుల్లో స్పష్టంగా కనిపించింది.
సీపీఎస్ రద్దు చేయాలని, ఇందుకు తక్షణమే అధ్యయన కమిటీ వేయాలని, ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టులో సీపీఎస్ఈయూ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని, పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో 10 వేల మంది ఉద్యోగులు సెలవు పెట్టారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో కిందిస్థాయి ఉద్యోగుల్లో అత్యధికులు సెలవుపై వెళ్లారు. జగిత్యాల జిల్లాలో 5,353 మంది సీపీఎస్ ఉద్యోగులుండగా, దాదాపు 3 వేల మంది ఉద్యోగులు సెలవు పెట్టారు. ఖమ్మం జిల్లాలో 3 వేల మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వేల ఉద్యోగులు, వరంగల్‌లో 4,500 మంది సెలవు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 10 వేల మంది సెలవు పెట్టినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
వికారాబాద్‌లో నాలుగువేలు, మహబూబ్‌నగర్‌లో 4,800 చొప్పున ఉద్యోగులు సెలవు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీపీఎస్ రద్దుచేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో సైతం సీపీఎస్ రద్దును ప్రస్తావించారని, కానీ మూడేండ్లు గడిచినా హామీ కార్యరూపం దాల్చకపోవడం దారుణమని అన్నారు. సర్వీసులో ఉన్నప్పుడు లక్ష రూపాయల జీతం తీసుకున్న ఉద్యోగి రిటైర్ కాగానే నెలకు రూ. 1,500 నుంచి రూ, 5,218 మాత్రమే పింఛన్‌గా పొందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

