హామీలపై రాహుల్ ఎందుకు మాట్లాడరు?
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్, ప్రియాంక డిక్లరేషన్లు ప్రకటించి.. ప్రజలు, నిరుద్యోగులను మోసగించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం వనపర్తిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- చెత్తబుట్టలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో
వనపర్తి టౌన్, నవంబర్ 17 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్, ప్రియాంక డిక్లరేషన్లు ప్రకటించి.. ప్రజలు, నిరుద్యోగులను మోసగించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం వనపర్తిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని కాపాడుతానని దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. బీజేపీ సర్కార్ ఓటు చోరీ చేసిందని గొంతెత్తున్న రాహుల్.. రాష్ట్రంలో సీటు చోరీలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
పదవులు చోరీ చేస్తూ ఓటు గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్‌కు, రేవంత్‌రెడ్డికి లేదని అన్నారు. అబద్ధపు హామీలతో మోసంచేసిన పార్టీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అబద్ధాల మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి చింపి చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లలో ఏ ఒక్కటీ కూడా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

