కాంగ్రెస్ అభయహస్తం కాదు.. ప్రజలకు శూన్యహస్తం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసి మూడేండ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
- మ్యానిఫెస్టోకు మూడేండ్లు
- ఖర్గే, రేవంత్, శ్రీధర్‌బాబు, భట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి
- హామీల అమలుపై నిలదీసిన మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసి మూడేండ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మూడేండ్ల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్‌రెడ్డి మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని పేరొంటూ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అభయహస్తం శూన్యహస్తంగా మారిందని ఆరోపించారు.
తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హామీలపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

