ఆసియన్ పర్యాటకులకు ఉచిత ఈ-వీసాలు!
భారత్-ఆసియన్ సంబంధాల బలోపేతానికి పర్యాటకులకు ఉచిత ఈ-వీసాలు, దీర్ఘకాలిక సముద్ర సహకార ప్రణాళిక, అణుశక్తి సాంకేతిక మార్పిడి, కీలక ఖనిజాల రంగంలో భాగస్వామ్యం సహా పలు చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.
- సముద్ర భద్రత, అణుశక్తి రంగాల్లో సహకారం
- భారత్ -ఆసియన్ దేశాల సంబంధాల బలోపేతానికి ప్రధాని మోదీ ప్రతిపాదనలు
మనీల: భారత్-ఆసియన్ సంబంధాల బలోపేతానికి పర్యాటకులకు ఉచిత ఈ-వీసాలు, దీర్ఘకాలిక సముద్ర సహకార ప్రణాళిక, అణుశక్తి సాంకేతిక మార్పిడి, కీలక ఖనిజాల రంగంలో భాగస్వామ్యం సహా పలు చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. శాంతియుత, స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్‌పై ఉమ్మడి దృష్టిని ఆయన ప్రస్తావించారు. పరస్పర సహకారంతోనే ఇండో-పసిఫిక్ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. మనీలలో మంగళవారం జరిగిన 23వ ఆసియాన్-భారత్ సదస్సు అనంతరం విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఈ ప్రతిపాదనలను వివరించింది.
అనుసంధానం, శాస్త్రీయ పరిశోధన, విపత్తు నిర్వహణ, కోస్ట్ గార్డ్ సహకారం, సముద్ర జలాల్లో జరిగే కార్యకలాపాలపై అవగాహన, నావికుల భద్రత అంశాలతో దీర్ఘకాలిక ఆసియాన్-భారత్ సముద్ర సహకార ప్రణాళికను రూపొందించాలని మోదీ సూచించారు. ఈ ప్రాంతంలోని సైబర్ భద్రత నిపుణులకు నైపుణ్యం పెంచేందుకు ఉమ్మడి సైబర్ ఫోరెన్సిక్స్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రతిపాదించారు. సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసపూరిత పథకాలు, ఇతర డిజిటల్ ముప్పులపై అవగాహన పెంచడం దీని ఉద్దేశమని తెలిపారు. అణుశక్తి రంగంలో ఆసియాన్-భారత్ సాంకేతిక మార్పిడితోపాటు, అంతరిక్ష సాంకేతికతపై ఆసియాన్-భారత్ స్పేస్ హ్యాకథాన్, గనులు, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని కూడా మోదీ ప్రతిపాదించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

