తెలంగాణ ద్రోహి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి అని, 1956లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం నుంచే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నిందని బీఆర్ఎస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ధ్వజమెత్తారు.
- మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
- నాగార్జునసాగర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ ధర్నా
హాలియా, నవంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి అని, 1956లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం నుంచే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నిందని బీఆర్ఎస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ధ్వజమెత్తారు. తాగునీటి ప్రాజెక్టు పేరుతో ఏపీ ప్రభుత్వం విజయపురిసౌత్ సాగర్ జలాశయం నుంచి నీటిని తీసుకెళ్లేందుకు వీలుగా నిర్మాణాలను చేపట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సాగర్ కొత్త బ్రిడ్జి ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్ధానికసంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రజల వాటా పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీల మేర కృష్ణా జలాలను అక్రమంగా రాయలసీమ ప్రాంతానికి తరలించుకుపోయిందని చెప్పారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి అమరజీవ జలధార పథకం ద్వారా రోజుకు 160 మిలియన్ లీటర్ల నీటిని తరలించుకుపోయేందుకు అక్రమ నిర్మాణాలను చేపడుతున్నదని తెలిపారు. దోచుకోవడం, దాచుకోవడం, కాంగ్రెస్ అధిష్ఠానానికి మూటలు పంపడం తప్ప సీఎం రేవంత్‌కు మరొకటి కనిపించడంలేదని ధ్వజమెత్తారు. అమరజీవ జలధార పథకాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్‌లో సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు బీడుబారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పనులను ఆపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ధర్నాతో హైదరాబాద్- అమరావతి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోగా.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం 200 మంది పోలీస్ సిబ్బందిని మోహరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

