సజ్జనార్‌ను తొలగించాలి
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసి ఇటీవల బదిలీ అయిన సజ్జనార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీపీగా పనిచేసిన సమయంలో ఆయన ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని సోషల్‌మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. సోషల్‌మీడియాలో చురుకుగా కనిపిస్తూ, నేరాల నియంత్రణపై ప్రకటనలు చేస్తూ, ప్రజలకు నీతులు చెప్పిన ఉన్నతాధికారి తన ఉద్యోగకాలంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతున్నది.
- బీసీ జేఏసీ మహిళా అధ్యక్షురాలు జయంతి మట్టా డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసి ఇటీవల బదిలీ అయిన సజ్జనార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీపీగా పనిచేసిన సమయంలో ఆయన ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని సోషల్‌మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. సోషల్‌మీడియాలో చురుకుగా కనిపిస్తూ, నేరాల నియంత్రణపై ప్రకటనలు చేస్తూ, ప్రజలకు నీతులు చెప్పిన ఉన్నతాధికారి తన ఉద్యోగకాలంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సజ్జనార్‌ను వేరే శాఖకు పంపించడం కాకుండా సర్వీసు నుంచే తొలగించాలని బీసీ జేఏసీ మహిళా అధ్యక్షురాలు జయంతి మట్టా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. సజ్జనార్ అక్రమాస్తులపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నదని, ఎస్సై, సీఐ, ఏసీపీల నుంచి ఎంత తీసుకుంటారో అందరికీ తెలుసని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో కొం దరు పోలీసులు తనపై అక్రమ కేసులు పెడితే తాను ఆయనను కలిసి చెప్పానని, కానీ ఆయన మాత్రం తప్పుచేసిన వారికే వత్తాసు పలికారని ఆరోపించారు.
తర్వాత ఐదేండ్ల్లు ఆయన కనిపించకపోతే సంతోషం అనిపించిందని పేర్కొన్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పైరవీతో ఆయన మళ్లీ సీపీగా రావడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. ఇటీవల తిరుపతి వెళ్లినప్పుడు సజ్జనార్‌ను తొలగించమని కోరుకున్నానని, వారంలోనే భగవంతుడు తన కోరిక నెరవేర్చాడని పేర్కొన్నారు. సజ్జనార్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వస్తున్నాయని, అధికారిగా ఉంటేనే ఇన్ని దారుణాలు చేసిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా వస్తే ప్రజల పరిస్థితి ఏందని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

