జీ రామ్ జీతో రాష్ర్టాలపై ఆరింతల ఆర్థిక భారం!
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు గతంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో కేంద్రం తెచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి పథకం వికసిత్ భారత్-రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్- గ్రామీణ్ (వీబీ జీ-రామ్ జీ పథకం) రాష్ర్టాలకు పెనుభారంగా మారనుంది.
- నరేగాతో పోలిస్తే రూ.33,000 కోట్ల అదనపు వ్యయం
- పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు గతంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో కేంద్రం తెచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి పథకం వికసిత్ భారత్-రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్- గ్రామీణ్ (వీబీ జీ-రామ్ జీ పథకం) రాష్ర్టాలకు పెనుభారంగా మారనుంది. ఈ పథకం ఈ ఏడాది జూలై నుంచి అమలవుతున్నది. ఇదే కనుక 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే అమల్లో ఉండి ఉంటే రాష్ర్టాలు ఎంత ఖర్చు చేసి ఉండేవో పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ సంస్థ లెక్కకట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ర్టాలపై రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు అదనపు వ్యయభారం పడేదని పేర్కొన్నది. గత ఏడాది కన్నా రాష్ర్టాలు దాదాపు ఆరింతలు వ్యయం చేసి ఉండేవని తెలిపింది. ఈ పథకం ప్రకారం .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఖర్చును భరించాలి. ఈశాన్య, హిమాలయ రాష్ర్టాలకు మాత్రం ఈ నిష్పత్తి 90:10గా ఉన్నది.
సగటున 43 పనిదినాలే
ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125కు పెంచడంతో కొత్త పథకంలో రాష్ర్టాల వ్యయభారం మరింత పెరుగుతుందని నివేదిక తెలిపింది. ‘అదే వ్యక్తి-పని దినాలు, వేతన రేట్లను పరిగణనలోకి తీసుకుంటే, 2025-26లో పాత పథకానికి బదులుగా కొత్తది అమల్లో ఉండి ఉంటే రాష్ర్టాలు దాదాపు రూ.33,000 కోట్లు ఖర్చు చేసి ఉండేవి’ అని పేర్కొన్నది. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద రాష్ర్టాలు వాస్తవంగా చేసిన రూ.5,261 కోట్ల వ్యయానికి ఇది దాదాపు ఆరింతలు. అలాగే గతంలో వేతనం రూ.300 ఉండగా, ఇటీవల రాష్ర్టాలు వాటిని సవరించాయి. కొత్త వేతనాలతో లెక్కిస్తే రాష్ర్టాలపై భారం ఏడు రెట్లు అధికమవుతుంది. పేరుకు 100 రోజుల పనిదినాలు అయినప్పటికీ గత ఏడాది సగటున 43 రోజుల పనిదినాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఒక వేళ వీటి సంఖ్య ఎక్కువైతే ఆర్థిక భారం కూడా పెరుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

