29న అలుగునూర్‌లో దీక్షా దివస్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్గునూర్‌లో ఈ నెల 29న దీక్షా దివస్ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. కరీంనగర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సభపై ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.
- హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఉద్యమంలో నవంబర్29 ఓ చారిత్రక మైలురాయి
- పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ వినోద్, గంగుల తదితరులు
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 17 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్గునూర్‌లో ఈ నెల 29న దీక్షా దివస్ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. కరీంనగర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సభపై ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. అనంతరం దిక్షా దివస్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 29న సాయంత్రం 4గంటలకు అలుగునూర్‌లో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
ఈ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం ఉన్నదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన అలుగునూరులోనే ఈ సారి దీక్షా దివస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కేసీఆర్ అరెస్ట్‌కు సాక్షిగా నిలిచిన ప్రాంతంలో సభ నిర్వహించడం ఉద్యమ చరిత్రను మరోసారి గుర్తు చేసుకునే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ బొట్టు, డప్పు కొట్టే కార్యక్రమాలు, వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలోనూ దీక్షా దివస్‌కు సంబంధించిన కార్యక్రమాలు, ప్రచార వివరాలు, ఫొటోలు, వీడియోలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు వివరించారు.
సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, టీ జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు తోట ఆగయ్య, జీవీ రామకృష్ణారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు దావ వసంత, తుల ఉమ, న్యాలకొండ అరుణ, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు కలెక్టర్ చిత్రామిశ్రా, పోలీస్ మిషనర్ గౌస్ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌ని వేర్వేరుగా కలిసి దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు అనుమతులు ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha diwas
- Karimnagar
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

