స్టార్క్, హెడ్ రిలీజ్
ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్లను తమ జట్ల నుంచి తప్పించాయి.
- స్టార్ ప్లేయర్లను వదులుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్లను తమ జట్ల నుంచి తప్పించాయి. ఆస్టేల్రియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 11.75 కోట్లు), హిట్టర్ ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ (రూ. 14 కోట్లు) రిలీజ్ చేశాయి. బిజీ అంతర్జాతీయ షెడ్యూల్ నేపథ్యంలో ఈ ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు 2027 సీజన్‌కు అందుబాటులో ఉండబోమని ఆయా ఫ్రాంచైజీలకు తేల్చి చెప్పడంతో ఢిల్లీ, హైదరాబాద్ శనివారం వారిని తమ జట్ల నుంచి విడుదల చేశాయి.
ఇక నిరుడు వేలంలో రూ. 18 కోట్లకు కోల్‌కతా దక్కించుకున్న మతీశ పతిరాణను నైట్‌రైడర్స్ వేలానికి వదిలేసింది. ముంబై ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.5 కోట్లు),దీపక్ చాహర్ (రూ. 9.25 కోట్లు)కు ఉద్వాసన పలకగా రాజస్థాన్ హెట్మయర్ (రూ. 11 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ. 6.5 కోట్లు)ను వద్దనుకుంది. లక్నో జట్టు అవేశ్ ఖాన్ (9.75 కోట్లు) సేవలకు గుడ్‌బై చెప్పగా సీఎస్కే ఏరికోరి తెచ్చుకున్న ప్రశాంత్ వీర్ (రూ. 14.2 కోట్లు)తో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీని విడుదల చేసింది.
కేకేఆర్ ప్రక్షాళన
జట్టు నుంచి అత్యధిక మందిని రిలీజ్ చేసిన ఫ్రాంచైజీల్లో కోల్‌కతా ప్రథమ స్థానంలో ఉంది. గత సీజన్లో దారుణమైన ఆటతో ఏడో స్థానంలో ముగించిన ఆ జట్టు ఏకంగా 12 మందిని వేలానికి వదిలేసింది. గుజరాత్ అత్యల్పంగా ఐదుగురినే జట్టు నుంచి రిలీజ్ చేసింది.
లక్నో ఖాతాలో రూ. 47.45 కోట్లు
రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో లక్నో వద్ద అత్యధికంగా రూ. 47.45 కోట్ల నగదు ఉండగా.. జట్టులో ఏడు ఖాళీ స్లాట్స్ మిగిలాయి. ఆ తర్వాత కేకేఆర్ రూ. 41.65 కోట్లు (8 స్లాట్స్), హైదరాబాద్ రూ. 40.15 కోట్లు (7), ఢిల్లీ రూ. 39.5 కోట్లు (9), ముంబై రూ. 32.6 కోట్లు (9), చెన్నై రూ. 28.5 కోట్లు (6), రాజస్థాన్ రూ. 27.05 కోట్లు (6), పంజాబ్ రూ. 18.6 కోట్లు (6), ఆర్సీబీ రూ. 14.5 కోట్ల (5)తో నిలిచాయి. ముగ్గురిని మాత్రమే రిలీజ చేసిన గుజరాత్ వద్ద వేలానికి అత్యల్పంగా రూ. 8.75 కోట్లు మిగిలాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

