‘సమ్మకసాగర్’కు ఎన్వోసీ ఇవ్వండి
సమ్మక్కసాగర్ బరాజ్ వినియోగానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వడంతోపాటు తెలంగాణకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ముంపునకు సంబంధించి ఎంత పరిహారం కోరినా అందిస్తామని వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆయన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి ఢిల్లీ నుంచి నేరుగా రాయ్‌పూర్‌కు వెళ్లి ఛత్తీస్‌గఢ్ సీఎంతో భేటీ అయ్యారు.
- ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ వినతి
- విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించినట్టు ప్రకటనలు
- ఆర్భాటమే తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదంటున్న తెలంగాణ ఇంజినీర్లు
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): సమ్మక్కసాగర్ బరాజ్ వినియోగానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వడంతోపాటు తెలంగాణకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ముంపునకు సంబంధించి ఎంత పరిహారం కోరినా అందిస్తామని వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆయన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి ఢిల్లీ నుంచి నేరుగా రాయ్‌పూర్‌కు వెళ్లి ఛత్తీస్‌గఢ్ సీఎంతో భేటీ అయ్యారు.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్వోసీ, ముంపు, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మకసాగర్ బరాజ్‌లో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతివ్వాలని కో రారు. బరాజ్ వల్ల ఏర్పడే ముంపుపై ఖరగ్‌పూర్ ఐఐటీ ఇ ప్పటికే అధ్యయ నం జరిపి నివేదిక సమర్పించిందని, ఎఫ్ఆర్ఎల్ వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతుందని, భారీ వరదల సమయంలోనూ ముంపు 100 ఎకరాలకు మించబోదని ఆ నివేదికలో పేర్కొన్నదని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో +83 మీటర్ల పూర్తిస్థాయి మట్టం వద్ద నీటినిల్వకు ఎన్వోసీ జారీచేయడంతోపాటు మిగిలిన అనుమతుల ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విజ్ఞప్తికి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారని, ఎన్వోసీ ప్రక్రియను త్వరగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తాజాగా చర్చల్లో కొత్తగా తేలిందేమీ లేదని, కేవలం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందకే రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారని నిపుణులు విమర్శిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

