కరువంటూ.. చెరువు ఖాళీ
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్ డివిజన్ల పరిధిలో సుమారు 100 ఎకరాలకు పైగా అంబీర్ చెరువు విస్తరించి ఉన్నది. ఈ చెరువు ద్వారా అటు శేరిలింగంపల్లి, ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వందలాది కాలనీల నీటి అవసరాలు తీరుతున్నాయి.
- సుందరీకరణ పేరుతో నాలాల్లోకి అంబీర్ నీటిని వదులుతున్న సర్కార్
- చుట్టుపక్కల కాలనీల్లో భూగర్భజలాలకు ముప్పు
- నీటి పొదుపు సర్కార్ మాటలు..ఇక్కడ నీటి మీద రాతలే..
- నీటిని వృథాగా వదిలేయవద్దని వేడుకుంటున్న స్థానికులు
- ఎమ్మెల్యే గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు సన్నద్ధం
మియాపూర్, నవంబర్ 16:ఓవైపు నగరంలో భూగర్భ జలాలు పడిపోతూ నీటి కోసం ప్రజలు నానా తంటాలు పడుతూ ఉంటే.. మరోవైపు అదే నీటిని స్వయంగా సర్కారే వృథా చేస్తున్న వైనమిది. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుంటూనే భూగర్భజలాల పెంపునకు ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని చెబుతున్న సర్కార్.. తనదాకా వచ్చేసరికి మాత్రం ఆ మాటలను నీటిమీద రాతలేనని నిరూపిస్తున్నది. జలమండలి, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు ప్రజలలో నీటి పొదుపుపై విస్తృత చైతన్యం నింపి తిరిగి వర్షాలు వచ్చేవరకు తమవంతు బాధ్యత నిర్వర్తించేలా అవగాహన కల్పింస్తుండగా .. అందుకు భిన్నంగా పదుల సంఖ్యలో కాలనీల భూగర్భజాలల పెంపునకు ప్రత్యక్షంగా దోహదపడే అంబీర్ చెరువు నుంచి నీటిని వృథాగా డ్రైనేజీల పాలు చేస్తున్నది రేవంత్ సర్కార్.
మియాపూర్, నవంబర్ 16: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్ డివిజన్ల పరిధిలో సుమారు 100 ఎకరాలకు పైగా అంబీర్ చెరువు విస్తరించి ఉన్నది. ఈ చెరువు ద్వారా అటు శేరిలింగంపల్లి, ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వందలాది కాలనీల నీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ చెరువు నీటి కారణంగా చుట్టపక్కల కాలనీల భూగర్భజలాలు వృధ్ధి చెంది వేలాది మంది ప్రజల నీటి అవసరాలను తీరుతున్నాయి. వర్షాభావానికి తోడు సరైన ప్రణాలికలు లేని రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన కరువుతో ఇప్పటికే సిటీలోని మెజార్టీ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అయితే అంబీర్ చెరువులో ఇప్పటికే భారీగా వరద నీరు చేరిఉండటంతో చుట్టుపక్కల కాలనీలలో ప్రస్తుతానికి ఎటువంటి నీటి కొరత ఏర్పడలేదు. ఇలాంటి తరుణంలో అంబీర్ చెరువు సుందరీకరణ పేరుతో.. చెరువులోని నీటిని నాలల్లోకి వదిలేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం నాలుగురోజుల క్రితం శంషీగూడ వైపు అంబీర్ చెరువు అలుగులను భారీ యంత్రాల సాయంతో ధ్వంసం చేసి నీటిని కిందికి వృథాగా వదిలేస్తున్నారు.
స్థానికులు, మత్స్యకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత..
ఇటీవల సంబంధిత విభాగాల అధికారులు, పనులు దక్కించుకున్న గుత్తేదారులు ఈ విషయాన్ని స్థానిక మత్స్యకారుల సొసైటీ ప్రతినిధులకు చేరవేసారు. దీనికి తోడు చెరువులో సొసైటీ ఆధ్వర్యంలో పెంచిన చేపలు డ్రైనేజీల్లోకి కొట్టుకుపోతున్నాయి. వెంటనే బాధిత కాలనీల ప్రజలు, మత్స్యకారుల సొసైటీ ప్రతినిధులు విషయాన్ని నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకుపోగా ఆయన ఆదేశాలతో అధికారులు నీటి విడుదలను నిలిపేసారు. అయితే సర్కార్‌లోని పెద్దల నుంచి ఫోన్లు రాగానే మళ్లీ యధావిధిగా అలుగును ధ్వంసం చేసి నీటి వృథాను కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. చెరువు చుట్టుపక్కల ఉండే ప్రగతినగర్, శంషీగూడ, శ్రీనివాస్‌నగర్, ఎల్లమ్మబండ, ఆదిత్యనగర్ సహా పదుల సంఖ్యలో కాలనీల్లోని భూగర్భజలాలు పడిపోయి బోర్లన్నీ ఎండిపోయే ప్రమాదం ఉంది. చెరువు సుందరీకరణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెబుతున్న బాధిత కాలనీల ప్రజలు ప్రస్తుత నీటి విపత్కర పరిస్థితులలో అంబీర్ చెరువులోని నీటిని వృథాగా కిందికి వదిలేయటాన్ని మాత్రం వ్యతిరేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అంబీర్ చెరువు నీటి వృథాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బాధిత కాలనీల ప్రజలు బుధవారం పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
అంబీర్ చెరువు నీటిని నాలాలోకి వదలొద్దు
- బీఆర్ఎస్ నేత సతీష్‌రావు
మియాపూర్, నవంబరు 17 : భూగర్భ జలాలపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సతీష్‌రావు డిమాండ్ చేశారు. ఎల్‌నినోతో నెలకొంటున్న తీవ్ర నీటి సమస్య నేపథ్యంలో సుందరీకరణ పేరుతో చెరువులోని నీటిని వృథాగా నాలాలోకి విడుదలను తక్షణమే నిలిపేయాలని కోరారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వమే నీటి పొదుపు గురించి చెబుతూ ఇలా నీటిని వృథా చేయటం ఏంటని ప్రశ్నించారు. ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు అలుగును శంషీగూడ వైపు ధ్వంసం చేసి నీటిని నాలాలోకి వదులుతున్న ప్రాంతాన్ని సతీష్‌రావు పార్టీ నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలే ట్యాంకర్లు దొరక్క ఇబ్బందులు పడుతుండగా చెరువును ఖాళీ చేయటం వల్ల భూగర్భజలాలు పడిపోయి పరిసరాల్లోని కాలనీల్లో బోర్లు ఎండిపోయే ప్రమాదముందన్నారు. నీటి అవసరాలు అధికంగా ఉన్న ప్రస్తుత సమయంలో నీటిని వృథాగా పోనివ్వవద్దని, ధ్వంసం చేసిన ఆలుగును పునరుద్ధరించి తక్షణమే నీటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలని సతీష్‌రావు డిమాండ్ చేశారు. నీటిని కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే సానిక కాలనీల ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
భూగర్భ జలాలు పడిపోతాయి
వర్షాలు లేక తీవ్ర నీటి కష్టాలు నెలకొన్న ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితులలో అంబీర్ చెరువులోని నీటిని వృథాగా కిందికి వదిలేయటం ఏమాత్రం సమంజసం కాదు. ఈ చెరువు ఆధారంగా ఆశాజనకమైన భూగర్భజలాలలో ఏండ్ల తరబడి నీటి సమృద్ధి నెలకొని ఉన్నది. చెరువు సుందరీకరణ పేరుతో ఆకస్మికంగా అంబీర్ చెరువులోని నీటిని డ్రైనేజీల ద్వారా కిందికి వృథాగా వదలటం ద్వారా పెద్ద సంఖ్యలో కాలనీల భూగర్భజలాలు పడిపోయి బోర్లన్నీ ఎండిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో పాటు చెరువులోని చేపలు సైతం కొట్టుకుపోతున్నాయి. ఈ సమస్యను బాధిత కాలనీవాసులందరితో కలిసి మరోమారు ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకెళ్తాం. చెరువు సుందరీకరణకు మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. ప్రస్తుత పరిస్థితులలో ఆ పేరుతో నీటి వృథా వద్దన్నది మా మనవి.
బాలరాజు, శంషీగూడ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

