చిత్తు కాగితంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో చిత్తు కాగితంగా మారిందని మాజీ మంత్రులు గంగుల , జీవన్‌రెడ్డి, కొప్పుల , మాజీ ఎంపీ వినోద్ విమర్శించారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో చిత్తు కాగితంగా మారిందని మాజీ మంత్రులు గంగుల , జీవన్‌రెడ్డి, కొప్పుల , మాజీ ఎంపీ వినోద్ విమర్శించారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులతో కలిసి నిరసన చేపట్టారు.
-కరీంనగర్ కార్పొరేషన్
కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు మూడేండ్లు.. ప్రజలకు కన్నీళ్లు
కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మూడేండ్లు గడిచినా అమలు కాని కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రతులను చింపేసి చెత్తబుట్టలో పడేశారు. బాజిరెడ్డి జగన్, ప్రభాకర్‌రెడ్డి, సిర్పరాజ్, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్ పాల్గొన్నారు.
-ఖలీల్‌వాడి
రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తున్నదని మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 2023 సెప్టెంబర్ 17న హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో సోనియాగాంధీ, మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారని, అభయహస్తం పేరుతో మిగిలిన హామీలన్నింటితో కూడిన పూర్తి ఎన్నికల మ్యానిఫెస్టో 17 నవంబర్ 2023న హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించి మూడేండ్లు గడిచిన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నస్పూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
-సీసీసీ నస్పూర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

