బోర్డు నిర్ణయిస్తే తిరిగొస్తా: జెన్సన్
తనను మళ్లీ సీఈవోగా నియమించాలని బోర్డు నిర్ణయిస్తే ఆ బాధ్యత చేపట్టడం తాను గౌరవంగా భావిస్తానని ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెన్సన్ హువాంగ్ మంగళవారం తెలిపారు. వ్యక్తిగత జీవితంలో తాను ‘తీవ్ర తప్పిదాలు’ చేశానని అంగీకరించారు.
- వ్యక్తిగత జీవితంలో తీవ్ర తప్పిదాలు చేశానంటూ ఒప్పుకోలు
- ఆయనను తిరిగి తెచ్చే పరిస్థితి లేదన్న బోర్డు
అమెరికా: తనను మళ్లీ సీఈవోగా నియమించాలని బోర్డు నిర్ణయిస్తే ఆ బాధ్యత చేపట్టడం తాను గౌరవంగా భావిస్తానని ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెన్సన్ హువాంగ్ మంగళవారం తెలిపారు. వ్యక్తిగత జీవితంలో తాను ‘తీవ్ర తప్పిదాలు’ చేశానని అంగీకరించారు. గత వారం సీఈవో పదవికి రాజీనామా చేసి బోర్డు నుంచి తప్పుకున్న తర్వాత ఆయన చేసిన తొలి బహిరంగ ప్రకటన ఇదే. ఎక్స్‌లో జెన్సన్ విడుదల చేసిన ప్రకటనలో ఎన్విడియా ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములు, వినియోగదారులు తిరిగి రావాలని కోరారని తెలిపారు.
వాటాదారులు, ఉద్యోగులు, కంపెనీ, అమెరికా ప్రయోజనాలకు తన పునర్నియామకం మంచిదని డైరెక్టర్లు భావిస్తే తిరిగి బాధ్యతలు చేపడుతానని చెప్పారు. ‘ఎన్విడియాలో ప్రతి ఒక్కరిపై ఉండే ప్రమాణాలకు నేను నిలబడలేకపోయాను’ అని జెన్సన్ పేర్కొన్నారు. బోర్డుకు ఇబ్బందులు కలిగించినందుకు విచారం వ్యక్తం చేసిన ఆయన, ‘బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు సహకరించేందుకు కట్టుబడి ఉన్నాను’ అని పేర్కొన్నారు. అయితే, జెన్సన్ను తిరిగి తీసుకొచ్చే ప్రణాళికలు ప్రస్తుతం లేవని ఎన్విడియా బోర్డు సోమవారం సంకేతాలిచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

