KTR | చెక్‌డ్యామ్‌లు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా.. అసెంబ్లీలో ఇచ్చే పీపీటీ అదేనా.. కేటీఆర్ సెటైర్లు
KTR | రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, సభ్యులకు చెక్‌డ్యామ్‌లు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, సభ్యులకు చెక్‌డ్యామ్‌లు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభలోకి అడుగుపెట్టాక సీఎం, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, 120 మంది ఎమ్మెల్యేలకూ సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రధాన ప్రతిపక్షంగా.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయరంగాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో 2016 మార్చి 31న కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ బాయ్‌కాట్ చేసిందని..ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించారని గుర్తుచేశారు. అప్పుడు తప్పు అన్న కాంగ్రెస్ పార్టీకి, ఈ రోజు అదే పద్ధతి సరైనదిగా ఎలా మారింది? అని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్‌కు లేఖ కూడా ఇచ్చామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని తెలిపారు.
నదీ జలాలపై సీఎంకు కనీస అవగాహన లేదు
నదీ జలాలపై, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమకు శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు భాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారని, అసలు ఆ ప్రాజెక్ట్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నదన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్లో ఉన్నదో కూడా తెలియని ముఖ్యమంత్రితో గోదావరి-కృష్ణా జలాలపై ఈరోజు చర్చ చేయాలా? అని ప్రశ్నించారు. మేము మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్ డ్యామ్‌లు ఎలా పేల్చాలో నేర్పిస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చారో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చారో వివరిస్తారా? వట్టెం పంప్‌హౌస్ ఎలా ముంచారో చూపిస్తారా? లేక కృష్ణానదిలో తెలంగాణకు ఉన్న హకులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్లో చూపిస్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాగునీటిరంగంలో పూర్తిగా ఫెయిల్
రాష్ట్రంలో సాగునీటిరంగం నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణిస్తే ఇప్పటివరకు మృతదేహాలను కూడా వెలికితీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తిగా కూలిపోయినా, ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేని దుస్థితిలో రేవంత్ సర్కారు ఉన్నట్టు విమర్శించారు. ఆ ఘటనకు బాధ్యులైన ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రోవాటర్ సపె్లై అండ్ సీవరేజి బోర్డ్ సిఫార్సు చేసినప్పటికీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోలేని స్థాయిలో ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వట్టెం పంప్‌హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోయిన సర్కారు ఇది అని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా పూర్తిగా పకన పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి తరచూ ‘పండబెట్టి తొకుతాం’ అంటారని, నిజంగానే ఆ పథకాన్ని పండుకోబెట్టి, తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా పాలమూరు రైతాంగాన్ని తొకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరానికైనా అదనంగా సాగునీరు అందించిందా? ఒక చెరువును బాగు చేసిందా? ఒక కాలువను మరమ్మతు చేసిందా? అని ప్రశ్నించారు. ఏం చేశారని మీరు ప్రజల ముందు చెప్పుకుంటారు? అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

