మోర్తాడ్, ఫిబ్రవరి 4: హామీలు ఇచ్చి మోసగించిన రేవంత్‌రెడ్డికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని సూచించారు. బుధవారం రాత్రి నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని ఒకటి, పదో వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమ్‌గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మంజూరు చేసిన పనులు కాంగ్రెస్ వచ్చాక ఆగిపోయాయని, మీ ఓటుతో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబితేనే ఆయా పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని పాత పేర్లతో కాకుండా జీవో మార్చి కొబ్బరికాయలు కొట్టిండ్రని, ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు.